: కష్టకాలంలో నా భార్యే తోడుంది: శ్రీశాంత్
నిండా కష్టాల్లో మునిగినప్పుడు తన భార్య భువనేశ్వరీ కుమారి అండగా నిలిచిందని కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ తెలిపాడు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, పెళ్లి తన జీవితంలో చాలా మార్పులు తెచ్చిందని అన్నాడు. ప్రస్తుతం డాన్స్ లపైనే దృష్టి సారించానని శ్రీశాంత్ తెలిపాడు. కొరియోగ్రాఫర్ స్నేహతో కలిసి ఝలక్ దిక్ లాజా అనే రియాలిటీ షో చేస్తున్నానని, తనకు మ్యూజిక్, డాన్స్ అంటే చాలా ఇష్టమని వెల్లడించాడు. స్కూల్ కు వెళ్లేటప్పుడు డాన్స్ నేర్చుకున్నా... పోటీల్లో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారని శ్రీశాంత్ వెల్లడించారు.