: ఇంటర్ ఫలితాల్లో 96 శాతం మార్కులు సాధించిన కేజ్రీవాల్ కుమార్తె


ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత సీబీఎస్ఈ ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో టాప్ పొజిషన్లో నిలిచింది. నిన్న (బుధవారం) విడుదల చేసిన ఫలితాల్లో ఆమె 96 శాతం మార్కులు సంపాదించింది. ప్రాథమికంగా సైన్స్ రంగంలో విద్యార్థి అయిన తాను ప్రస్తుతం ఐఐటీపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు ఆంగ్ల ఛానల్ సీఎన్ఎన్-ఐబీఎన్ తో మాట్లాడిన హర్షిత, తన మార్కులతో పూర్తిగా సంతృప్తి చెందినట్లు తెలిపింది. ఇక నుంచి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పింది. తన తల్లిదండ్రులే తనకు రోల్ మోడల్స్ అన్న ఆమె ఐఐటీకి వెళ్లాలనుకుంటున్నట్లు వివరించింది. ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో ఎక్కువ మార్కులు పొందిన హర్షిత, ఆ సబ్జెక్ట్ తన ఫేవరెట్ అని అంది. కాగా, పరీక్షల సమయంలో తన తండ్రి రాజకీయాలు, ఉద్యమాలు, ఎన్నికలు ఏవీ తనను ప్రభావితం చేయలేదని వెల్లడించింది.

  • Loading...

More Telugu News