: రాష్ట్రం విడిపోతున్నందుకు బాధగా ఉంది: డీజీపీ ప్రసాదరావు
సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి డీజీపీగా సేవలందించిన డీజీపీ ప్రసాదరావు తన అనుభూతిని పంచుకున్నారు. రాష్ట్రం రెండుగా విడిపోతున్నందుకు బాధగా ఉందని అన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయిందని... అయితే భవిష్యత్తులో ఈ సమస్య పెరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థ బలంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళుతున్నానని... తనకు ఏ హోదా, పదవి ఇచ్చినా పరవాలేదని అన్నారు.