: చంద్రబాబు, వెంకయ్యల దిష్టిబొమ్మల దహనం
టీఆర్ఎస్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణికి సంబంధించిన శ్రీరాంపూర్ ఆర్కే-7 గని వద్ద టీబీజేకేఎస్ ఆధ్వర్యంలోని కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.