: మళ్లీ టీడీపీ గూటికి చేరనున్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య?


ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చవిచూసిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మళ్లీ సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బలమైన తెలుగుదేశం నాయకుడిగా సుద్దాలకు గుర్తింపు ఉండేది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో, ఆ పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదని సుద్దాల భావిస్తున్నారు. మరోవైపు, సీమాంధ్రలో టీడీపీ అధికారంలోకి రావడంతో, సొంత పార్టీనే మేలనే పునరాలోచనలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు జరిగిన మహానాడు వేడుకల్లో కూడా సుద్దాల విషయానికి సంబంధించి నేతలు గుసగుసలాడుకున్నారు. ఇప్పటికే నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా తమ అధినేతకు ఆయన రాయబారం పంపించారు.

  • Loading...

More Telugu News