: తెలంగాణలో ఆగిపోయిన బస్సులు, తెరుచుకోని దుకాణాలు


పోలవరం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచే టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. బంద్ కు టీఎన్జీవో, ఆర్టీసీ టీఎంయూ, లాయర్ల జేఏసీ మద్దతు తెలపడంతో ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News