: ఐపీఎల్ ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మట్టికరిచింది. తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ లో కోల్ కతా చేతిలో పంజబ్ జట్టు ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఉతప్ప, యూసుఫ్ పఠాన్ రాణించడంతో కోల్ కత జట్టు 163 పరుగులు చేసింది. ఆది నుంచి అరివీర భయంకరంగా కనిపించిన పంజాబ్ జట్టు కీలక సమయంలో చతికిలపడింది. మాక్స్ వెల్, మిల్లర్, బెయిలీ విఫలమై కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేవలం 138 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. పంజాబ్ ఫైనల్ చేరాలంటే చెన్నై, ముంబై మ్యాచ్ విజేతను మట్టికరిపిస్తే ఫైనల్లో కోల్ కతాతో తలపడవచ్చు.