: గండిపేటలో ముగిసిన మహానాడు
హైదరాబాదు శివారు గండిపేటలో మహానాడు సదస్సు ముగిసింది. రెండు రోజుల పాటు ఘనంగా జరిగిన మహానాడులో తెలుగుదేశం పార్టీ పలు తీర్మానాలను ఆమోదించింది. అలాగే కార్యకర్తల సంక్షేమం కోసం ఓ నిధిని కూడా టీడీపీ ఏర్పాటు చేసింది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పండుగ వాతావరణంలో ఈ సదస్సు సాగింది. మహానాడులో అధిక సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.