: కేసీఆర్ కు ఉండాల్సింది వార్ రూం కాదు... బార్ రూం: ఎర్రబెల్లి
కేసీఆర్ కు కావాల్సిందని వార్ రూం కాదని, బార్ రూం అని ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కు పోలవరంపై, ఉద్యోగుల విభజనపై ముందు తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అన్నీ తెలిసినా, కావాలని ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కనుకే కేసీఆర్ ఆటలు సాగుతున్నాయని ఎర్రబెల్లి తెలిపారు.
కేసీఆర్ అసలు రంగు కొద్ది రోజుల్లోనే బయటపడుతుందని ఆయన అన్నారు. 30 ఏళ్లుగా తెలంగాణ బడుగు, బలహీన వర్గాలకు కొమ్ముకాసిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీని ఆంధ్రాపార్టీ అంటే గల్లాపట్టి గుంజాల్సి ఉంటుందని హెచ్చరించారు.