: మహానాడులో కేసీఆర్ పై ఎర్రబెల్లి ఫైర్
మహానాడు వేదికపై మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో మంత్రి అయిన విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని ఆయన హితవు పలికారు. టీడీపీ వల్లే కేసీఆర్ రాజకీయాల్లో పైకొచ్చాడన్నారు. ఆనాడు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి కొడుకుకు 'తారక రామారావు' అని పేరు పెట్టుకున్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అన్నదమ్ములుగా విడిపోదాం - తెలుగువారిగా కలిసుందామని ఎర్రబెల్లి చెప్పారు.