: అమితాబ్ భారీగా కొనేశాడు...!
బాలీవుడ్ లెజెండరీ స్టార్ అమితాబ్ బచ్చన్ 'స్టాంపెడ్ కాపిటల్ కంపెనీ'కి చెందిన వాటాలను భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్ వెల్లడించిన వివరాల ప్రకారం స్టాంపెడ్ కాపిటల్ కంపెనీలో 1.1 లక్షల వాటాలను అమితాబ్ కొనుగోలు చేశారు. ఈ కంపెనీ షేర్ ఒక్కోటి 109.92 రూపాయల చొప్పున 1.21 కోట్ల రూపాయల విలువైన వాటాలు కొనుగోలు చేశారు. దీంతో ఈ కంపెనీ గత నెల రోజుల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే ఇటీవల అమితాబ్ బచ్చన్ 'జస్ట్ డయల్' అనే కంపెనీలో షేర్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీలో షేర్ 10 రూపాయల చొప్పున 62,794 షేర్లను కొన్నారు. అవి ఇప్పుడు 9 కోట్ల రూపాయల విలువ చేస్తున్నాయి.