: నోకియా లుమియా 520 వచ్చేసింది


భారతీయులకు అందుబాటు ధరకే నాజూకైన నోకియా లుమియా 520 అందుబాటులోకి వచ్చేసింది. నేటి నుంచీ విక్రయదారులు ముందస్తు ఆర్డర్లను స్వీకరించనున్నారు. విండోస్8తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ను మార్చి 20న నోకియా భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

లుమియా 520 ధర 10499 రూపాయలు. 4 అంగుళాల ఎల్ సీడీ టచ్ స్క్రీన్, ఒక గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 8జీబీ అంతర్గత మెమొరీ(64జీబీ వరకూ విస్తరించుకోవచ్చు), బ్లూటూత్, మైక్రో యూఎస్ బి తదితర ఫీచర్లు ఉన్నాయి. 2జీ, 3జీ నెటవర్క్ లను సపోర్ట్ చేస్తుంది. 5 మెగాపిక్సల్స్ కెమెరాతో నాణ్యమైన చిత్రాలను తీసుకోవచ్చు. ఇందులో సినిమాగ్రాఫ్, పనోరమ, ఫొటోషూట్, ఫొటో బీమర్ లాంటి అత్యాధునిక కెమెరా ఫీచర్లను ఏర్పాటు చేశారు. 1430 మిల్లీ యాంపీ అవర్స్ బ్యాటరీతో 14 గంటల వరకూ నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. మధ్యశ్రేణి ధరలో మంచి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ వినియోగదారులను మెప్పిస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News