: పాలనకు అంతరాయం కలుగకుండా ఉద్యోగుల కేటాయింపు: సీఎస్ మహంతి
ప్రభుత్వ పాలనకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు జరిపినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి తెలిపారు. పాలనా సిబ్బంది, హోంశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత అవసరాల కోసమే తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపు జరిగిందని చెప్పారు. కేటాయింపు మార్గదర్శకాల ఖరారుకు కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలోని కలెక్టర్లు, జేసీలు, అధికారులు వారి స్థానాల్లోనే ఉంటారని మహంతి చెప్పారు.