: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ నిన్న (మంగళవారం) ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు రూ.10వేల బెయిల్ బాండును ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు శాంతిభూషణ్, ప్రశాంత్ భూషణ్ సమర్పించడంతో వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తర్వాత నిన్న రాత్రి ఆయన తీహార్ కారాగారం నుంచి విడుదలయ్యారు. అవినీతి పరుల జాబితాలో తన పేరు చేర్చడంపై బీజేపీ నేత నితిన్ గడ్కరీ... కేజ్రీవాల్ పై పరువు నష్టం కేసు వేశారు.