: మోడీతో నిర్మాణాత్మక చర్చ జరిగింది: నవాజ్ షరీఫ్


భారత ప్రధాని నరేంద్ర మోడీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరిఫ్ ప్రకటించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మోడీ ఆహ్వానం మేరకు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చానని అన్నారు. చాలా కాలం తరువాత భారత్ కు రావడం ఆనందం కలిగించిదని ఆయన తెలిపారు. నిన్న జరిగిన మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం సంతోషకరమని ఆయన అన్నారు.

ఇరు దేశాల మధ్య భవిష్యత్ సంబంధాలు బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు బలపడేందుకు ఇది మంచి తరుణమని అన్నారు. భారత్, పాక్ మద్య సత్సంబంధాల బలోపేతానికి ఇరు దేశాలు కృషి చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News