: నిరుద్యోగులను నిలువునా ముంచిన హెచ్ఆర్ఇ సొల్యూషన్స్
హైదరాబాదులో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ నిరుద్యోగులను నిలువునా ముంచింది. ఉద్యోగాలిప్పిస్తామంటూ లక్షలాది రూపాయలను వసూలు చేసిన సంస్థ చివరకు బోర్డు తిప్పేసింది. హిమాయత్ నగర్ లోని హెచ్ఆర్ఇ సొల్యూషన్స్ బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బు వసూలు చేసింది. తర్వాత ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులను మభ్యపెట్టడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.