: విశాఖ హెచ్ పీసీఎల్ లో ప్రమాదం, హెడ్ కానిస్టేబుల్ మృతి
విశాఖ హెచ్ పీసీఎల్ లో మరో ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ప్రధాన ద్వారం కుప్పకూలింది. ఎలక్ట్రికల్ గేటు కూలిపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ పశ్చిమ బెంగాల్ కు చెందిన నీల్ దాస్ (47)గా గుర్తించారు.