: కార్యకర్తల త్యాగం వల్లే టీడీపీకి అఖండ విజయం: చంద్రబాబు
కార్యకర్తల త్యాగం వల్లే టీడీపీకి అఖండ విజయం లభించిందని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం విజయం తెలుగు ప్రజలకు పండుగ అని గండిపేటలో జరుగుతున్న పార్టీ 'మహానాడు'లో బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ భావి తరాలకు కూడా స్పూర్తి ప్రధాత అన్నారు. వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ నాంది పలికారని గుర్తు చేశారు. పేదవారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారన్నారు. కాంగ్రెస్ తో ఎన్నడూ రాజీ పడలేదని, టీడీపీపై కుట్రలు పన్నినవారు చరిత్ర హీనులుగా మిగిలిపోయారన్నారు. కేంద్రంలో మనం బలపర్చిన ఎన్డీఏ అధికారంలో ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో సుస్థిర పాలనకు నాంది పలికామన్నారు. ఈ క్రమంలో దేశంలోని పార్టీల్లో టీడీపీకి విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. అధికారం కోసం టీడీపీ ఎన్నడూ పాకులాడలేదని బాబు వివరించారు.