: గండిపేటలో ప్రారంభమైన టీడీపీ మహానాడు
హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ 33వ 'మహానాడు' ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తర్వాత దివంగత పార్టీ నేతలు ఎర్రన్నాయుడు, జీఎంసీ బాలయోగి, లాల్ జాన్ బాషా, పరిటాల రవి, మాధవరెడ్డిలకు బాబు నివాళులర్పించారు. మహానాడుకు చంద్రబాబు కుమారుడు లోకేష్, హరికృష్ణ కూడా హాజరయ్యారు. పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.