: మహానాడులో పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గండిపేటలోని మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బయల్దేరిన బాబు నేరుగా మహానాడు ప్రాంగణానికి వచ్చారు. అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. మహానాడుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి.