: వెంకయ్యకు పట్టణాభివృద్ధి శాఖ... అశోక గజపతికి విమానయాన శాఖ


భారత 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. నిన్న మోడీ రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఇవాళ ఉదయం ప్రధాని కార్యాలయానికి చేరుకున్న మోడీ మంత్రులకు శాఖలు కేటాయిస్తూ తొలి దస్త్రంపై సంతకం చేశారు.

రాజ్ నాథ్ సింగ్ కు హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖతో పాటు రక్షణ శాఖ, కార్పొరేట్ వ్యవహారాలను కూడా అప్పగించారు.
* వెంకయ్య నాయుడు - పేదరిక నిర్మూలన, పట్టణాభివృద్ధి శాఖ
* అశోక గజపతి రాజు - విమానయాన శాఖ
* గోపీనాథ్ ముండే - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ
* నితిన్ గడ్కరీ - రవాణా శాఖ, నౌకాయానం
* సదానంద గౌడ - రైల్వే శాఖ
* సుష్మా స్వరాజ్ - విదేశాంగ వ్యవహారాల శాఖ
* మేనకా గాంధీ - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
* నజ్మా హెప్తుల్లా - మైనార్టీ సంక్షేమ శాఖ
* స్మృతి ఇరానీ - మానవ వనరుల శాఖ
* ఉమా భారతి - జల వనరుల శాఖ
* అనంత్ గీతే - భారీ పరిశ్రమలు
* రాంవిలాస్ పాశ్వాన్ - ఆహార, పౌర సరఫరాల శాఖ
* రాధామోహన్ సింగ్ - వ్యవసాయ శాఖ
* రవిశంకర్ ప్రసాద్ - న్యాయ శాఖ
* హర్ స్మిత్ కౌర్ - ఫుడ్ ప్రాసెసింగ్
* కల్ రాజ్ మిశ్రా - చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ
* జ్యూల్ ఓరమ్ - గిరిజన సంక్షేమ శాఖ

  • Loading...

More Telugu News