: ముగిసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం


ప్రధానిగా నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సహచరుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి నాలుగు వేల మంది అతిథులు విచ్చేశారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తొలిసారిగా ఏడు దేశాల నుంచి అధినేతలు అతిథులుగా హాజరయ్యారు. 23 మంది కేంద్ర మంత్రులు, 10 స్వతంత్ర హోదా గల మంత్రులు, 12 మంది సహాయ మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోని దాదాపు అన్ని వార్తా టీవీ ఛానళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

  • Loading...

More Telugu News