: మోడీ కేబినెట్ లో ఇంకొందరు


మున్నా భయ్యాగా అభిమానుల్లో గుర్తింపు పొందిన నరేంద్ర సింగ్ తోమర్ తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన జ్యూల్ ఓరమ్ మరోసారి కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
రాధా మోహన్ సింగ్ కేంద్ర మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు.
సావర్చన్ గెహ్లాట్ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
సినీ నటి స్మృతీ జుబిన్ ఇరానీ తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె గతంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఢిల్లీ మాజీ మంత్రి, తాజాగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన హర్షవర్థన్ తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News