: ఈ పరిశోధనలు సాగితే మతిమరుపు మాయం


అల్జీమర్స్‌ అంటే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు. ఈ వ్యాధికారకమైన మూడు కొత్త జన్యుసూచికలను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనల్ని మరింత ముందుకు తీసుకువెళితే.. అల్జీమర్స్‌ చికిత్స పద్ధతుల్లో పెద్ద ముందడుగు అవుతుందని కూడా భావిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తల పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. వారు గుర్తించిన జన్యుపటం ఉన్నవారిలోనే ఒక్కొక్కరిలో ఒక్కొక్క తీరుగా.. వ్యాధిలక్షణాలు ఉంటున్నాయి. ఈ జన్యుసూచికలలో దేని ప్రభావం వ్యాధిమీద అధికంగా ఉంటుందో గుర్తిస్తే గనుక.. భవిష్యత్‌ ప్రయోగాలకు వీలవుతుందని పరిశోధకులు కార్లోస్‌, ఆలిసన్‌. ఎం.గోయట్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News