: మోడీ ప్రసంగాన్ని మొబైల్ ఫోన్ లో వినొచ్చు!
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార ప్రసంగం టీవీ లైవ్ కవరేజికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే టీవీ అందుబాటులో లేని వారి కోసం ప్రసంగాన్ని మొబైల్ ఫోన్ లో వినే అవకాశం కూడా కల్పిస్తున్నారు. బీజేపీతో కలిసి ఈ ఏర్పాటు చేసినట్లు మొబైల్ మార్కెటింగ్ కంపెనీ వీవాకనెక్ట్ తెలిపింది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఫోన్ నెంబరు 91 022 4501 4501 కు డయల్ చేసి ప్రసంగ పాఠాన్ని ఫోన్ లో వినవచ్చు.