: మోడీకి నేపాల్ ప్రధానమంత్రి ప్రత్యేక బహుమతి


దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీకి నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కోయిరాల ఓ బహుమతి ఇవ్వనున్నారట. ఖాట్మండులో హిందువుల పుణ్యక్షేత్రమైన పశుపతి నాథ్ దేవాలయ ప్రతిరూపాన్ని సమర్పించనున్నారట. శివలింగంతో రూపొందిన ఈ ప్రతిరూపాన్ని ప్రమాణ స్వీకారం అనంతరం కోయిరాల సమర్పిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. నేపాల్లో 80శాతం మంది హిందువులే ఉన్నారు. ఈ సందర్భంగా మోడీ, కోయిరాలల మధ్య పరిచయం నేపాల్ కు బాగా ఉపయోగపడుతుందని, త్వరలో తమ దేశంలో మోడీ పర్యటిస్తారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News