: ఢిల్లీలో నిరసన చేపట్టిన వైగో


ఎండీఎంకే చీఫ్ వైగో దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద నల్ల జెండాలతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీలంకలో తమిళుల ఊచకోతకు కారణమైన ఆ దేశాధినేత రాజపక్సే... నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ, వాజ్ పేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించలేదని చెప్పారు. రాజపక్సే రాకతో తమిళుల మనోభావాలు గాయపడతాయని అన్నారు.

  • Loading...

More Telugu News