: మోడీ మంత్రి వర్గంలో 45 మంది?
తన మంత్రి వర్గానికి సంబంధించిన జాబితాను నరేంద్ర మోడీ ఇప్పటికే రాష్ట్రపతికి పంపించారు. ఈ నేపథ్యంలో, ఎంతమందికి చోటు కల్పించారు? ఎవరెవరికి అవకాశం ఇచ్చారు? అనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మంత్రివర్గంలో 45 మందికి చోటు దక్కింది. వీరిలో 24 మంది కేబినెట్, 11 మంది సహాయ మంత్రులు, 10 మంది స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నట్టు సమాచారం. కీలకమైన రక్షణ శాఖను మోడీ తన వద్దనే ఉంచుకున్నట్టు తెలుస్తోంది.