: అమ్మకానికి 'ది'
ఓ తెలుగు సినిమాలో చార్మినార్ ను ఓ హాస్య నటుడు ఓ వెర్రోడికి విక్రయించిన సీన్ గుర్తుందా? అంటే వెర్రోళ్లు దొరికితే ఏదైనా అమ్మేయవచ్చనడానికి ఆ సీన్ ఓ ఉదాహరణ. సరిగ్గా ఆస్ట్రేలియాకు చెందిన ఒకండు అచ్చం మన హాస్య నటుడి పాత్రలో జీవించేస్తున్నాడు. అతడు ఆంగ్లంలో 'the' అక్షరాన్ని ఓ తెల్ల పేపర్ పై రాసి, దాన్ని ఫొటో తీసి ఈ కామర్స్ సైట్ ఈబేలో పెట్టాడు. దీన్ని అమ్ముతున్నాను కొనుక్కోండహో... అని ప్రకటించాడు. ఈ పదాన్ని వేలాది వాక్యాల్లో ఉపయోగిస్తాం. దీన్ని కొనుక్కుంటే పర్సులోనూ పెట్టుకోవచ్చంటూ ఓ ఉచిత సలహా కూడా ఇస్తున్నాడు. అదేంటోగానీ దీన్ని కొనుక్కేందుకు 43 మంది బిడ్లు వేశారు. ప్రస్తుతం ఇది 10,099 డాలర్లు పలుకుతోంది. అంటే సుమారుగా 5,55,000 రూపాయలు.