: టీడీపీలో చేరను... అనుబంధ సభ్యురాలిగా మాత్రం కొనసాగుతా: బుట్టా రేణుక
తాను టీడీపీలో చేరడం లేదని... అయితే టీడీపీ అనుబంధ సభ్యురాలిగా మాత్రం కొనసాగుతానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. తనపై వేటు వేస్తే... శక్తి ఉంటే తిరిగి పోటీ చేస్తానని లేకపోతే సమాజ సేవ చేసుకుంటానని తెలిపారు. తన నియోజకవర్గం ఎన్నో రకాలుగా వెనుకబడి ఉందని... నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీ అధినేత చంద్రబాబును కలిశానని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సహాయ సహకారాలు ఉంటేనే అభివృద్ధిని సాధించగలమని తెలిపారు. కాసేపటి క్రితం చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో విషయం ఏమిటంటే ఈ ఉదయమే ఆమె భర్త నీలకంఠం టీడీపీలో చేరారు.