: ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్నా: సీపీఐ నారాయణ
ఉన్నది ఉన్నట్టు మాట్లాడబట్టే తాను చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నానని సీపీఐ నారాయణ అన్నారు. హైదరాబాదులోని మఖ్థూం భవన్ లో తన వ్యాసాల సంకలనం, ఉద్యమకారుని డైరీ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వచ్చినందుకు ఆనందంగా ఉన్నా, తన చేతుల మీదుగా సీపీఐని రెండు భాగాలుగా విభజించాల్సి రావడం బాధకలిగించిందని అన్నారు.