: ప్రియాంకగాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తెండి: అమరీందర్ సింగ్
ప్రియాంక గాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకతను తగ్గించాలంటే ప్రియాంక గాంధీని తీసుకురావాలని అన్నారు. ఆమె మాత్రమే ప్రత్యర్థులకు సమర్థవంతంగా కళ్లెం వేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు.