: కాంగ్రెస్ పై వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం: సోనియా గాంధీ
దేశంలో కాంగ్రెస్ పార్టీపై ఏర్పడ్డ వ్యతిరేకతను పసిగట్టలేకపోయామని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం సోనియా గాంధీ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. గతంలో చాలా సార్లు ఓడిపోయామని ఆమె గుర్తు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహాన్ని తగ్గిస్తామని ఆమె తెలిపారు. ప్రతిపక్షమంటే ప్రజాసమస్యలను లేవనెత్తడమేనని ఆమె స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో కలిసి ప్రజాసమస్యలపై పోరాడుతామని సోనియా చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై వాచ్ డాగ్ పాత్ర పోషిస్తామని ఆమె వెల్లడించారు.