: తిరుమలేశుని దర్శనానికి లక్ష మంది భక్తులు: జేఈవో శ్రీనివాసరాజు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్లలో లక్ష మంది భక్తులు వేచి ఉన్నారని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు చెప్పారు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో 3 క్యూలైన్లలో భక్తులను దర్శనానికి అనుమతించే పద్ధతిని పరిశీలించినట్లు జేఈవో చెప్పారు. పాత పద్ధతితో పోలిస్తే... 3 క్యూ లైన్ల ద్వారా గంటకు 300 మంది భక్తులు తగ్గుతున్నారని ఆయన తెలిపారు. అయితే, మరోసారి పరిశీలించి 3 క్యూ లైన్ల పద్ధతిని పూర్తిస్థాయిలో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.