: అధికారుల నియామకంపై గవర్నర్ తో ముగిసిన బాబు చర్చలు
కొత్తగా ఏర్పడే రాష్ట్రం, ప్రభుత్వంలో పనిచేసే అధికారుల నియామకంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమావేశం ముగిసింది. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గంటపాటు సమావేశమైన వీరిద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. సీఎస్, డీజీపీ, సీఎం సెక్రెటరీ వంటి ఉన్నతాధికారుల నియామకంపై చర్చించారు. ఉద్యోగుల విభజనకు ద్విసభ్య కమిటీని నియమించారు. ఉద్యోగుల విభజన సమస్యలు ఈ కమిటీ పరిష్కరిస్తుందని గవర్నర్ చంద్రబాబుకు తెలిపారు. ఏపీకి కేటాయించనున్న సీఎం పేషీ అధికారుల విషయంపై కూడా చర్చించారు.