: జూన్ 20 లోపల మోడీ, అద్వానీ, అఖిలేష్ లను లేపేస్తాం: అజ్ఞాత వ్యక్తి


కాబోయే ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, యూపీ సీఎం అఖిలేష్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను జూన్ 20లోపు చంపేస్తామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి హెచ్చరిక లేఖ రాశాడు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ రైల్వే పోలీసులకు లేఖ పంపాడు. ఢిల్లీ, ఘజియాబాద్, బులంద్ షహర్, కాన్పూర్, మధుర, భోపాల్ రైల్వే స్టేషన్లలో బాంబులు అమర్చినట్టు లేఖలో పేర్కొన్నాడు. అలాగే, ఢిల్లీలోని కాళీ ఆలయం, ఘజియాబాద్ లోని దూడేశ్వర్ నాథ్, జానకి ఆలయాల్లో కూడా బాంబులను అమర్చినట్టు తెలిపాడు. ఈ లేఖతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

  • Loading...

More Telugu News