: కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం స్థలాల పరిశీలన


స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన 9 మంది అధికారుల బృందం కడప జిల్లాకు చేరుకుంది. జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించనుంది. ఈ బృందం గత రెండు రోజుల్లో ఖమ్మం జిల్లాలోనూ పర్యటించింది. అక్కడ కూడా పలు ప్రాంతాలలో స్థలాలను అన్వేషించింది. ఈ రెండు జిల్లాలలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ బృందం పర్యటిస్తోంది. తమ పర్యటన అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. అనంతరం ఎక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేది స్పష్టం అవుతుంది.

  • Loading...

More Telugu News