: పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశా...పార్టీ మారను: జగ్గారెడ్డి
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ను పాత పరిచయం కొద్దీ మర్యాదపూర్వకంగానే కలిశానని మాజీ విప్ జగ్గారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను పార్టీ మారుతానంటూ వచ్చిన వార్తలు నిరాధారమని అన్నారు. తాను పార్టీ మారేది లేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ను అభినందించేందుకు కలిశానని ఆయన తెలిపారు.