: పూంచ్ లో నిరవధిక కర్ఫ్యూ విధింపు
జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ లో నిరవధిక కర్ఫ్యూని విధించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఈ చర్య తీసుకున్నారు. ఒక మతానికి చెందిన ఓ బాలికను ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న మరో మతానికి చెందిన వ్యక్తి పబ్లిక్ గా కొట్టాడు. దీంతో అక్కడ మతకలహాలు చెలరేగాయి. జమ్మూకు పూంచ్ 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా పూంచ్ కు బలగాలను తరలిస్తున్నారు. ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని... కలహాలకు కారణమైన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ఇరువర్గాలకు చెందిన మత పెద్దలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.