: దిగి వస్తున్న బంగారం ధరలు!
బంగారం దిగుమతిపై ఆంక్షలను రిజర్వ్ బ్యాంకు సడలించడంతో దేశీయ మార్కెట్ లో ధరలు భారీగా పతనమవుతున్నాయి. నిన్న (గురువారం) పది గ్రాములపై రూ.800లు తగ్గగా, ఈ వారంలో మొత్తం రెండువేల దాకా ధర తగ్గిందట. దాంతో, హైదరాబాదు మార్కెట్ లో ఈ రోజు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.26,600కు చేరింది. అటు 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.28,500లు పలుకుతోంది. నగర మార్కెట్ లో కిలో వెండి ధర రూ.41,250గా ఉంది.
కాగా, వచ్చే కొత్త ప్రభుత్వ బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే దీపావళి పండుగకల్లా 10 గ్రాముల బంగారం ధర రూ.23,000 -రూ.24,000 మధ్యకు చేరవచ్చని ముంబయి మార్కెట్ వర్గాల సమాచారం.