: జగన్ పొలిటికల్ బాద్ షా.. జూ. ఎన్టీఆర్ టాలీవుడ్ బాద్ షా!


సినిమా ఫ్లెక్సీలు కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. జూ. ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'బాద్ షా' ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖలో కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. కిన్నెర థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో 'జగన్ పొలిటికల్ బాద్ షా.. జూ. ఎన్టీఆర్ టాలీవుడ్ బాద్ షా' అంటూ రాయడమే కాకుండా, 'ఈ వ్యాఖ్యలు రాజకీయాలకు అతీతం' అని ఓ క్యాప్షన్ కూడా పెట్టి, వేసవిలో మరింత వేడి పుట్టించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తీసి వేశారు. 

  • Loading...

More Telugu News