: థాయ్ లాండ్ లో సైనిక పాలన
థాయ్ లాండ్ లో ప్రభుత్వ పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ప్రయుత్ ఛాన్-ఓఛా ప్రకటించారు. ఇకనుంచి దేశ పరిపాలనను సైన్యమే చూసుకుంటుందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన పాలకపక్షంపై ఓడిపోయిన ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, మళ్లీ ప్రతిపక్షాల కూటమి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి, ముందుగా ప్రధాన ప్రతిపక్షం తప్పుకోవాలని హెచ్చరించాయి. దీన్ని ప్రభుత్వం అదుపు చేయలేక చూస్తూ ఊరుకుంది. దానివల్ల ప్రజా జీవనానికి భంగం వాటిల్లుతోందన్న నెపంతో, వెంటనే ప్రభుత్వ పాలనను సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు అధికారికంగా తెలిపారు.