: టీడీపీలో చేరిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ


తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీలో చేరారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన వర్మ ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. గెలుపొందిన తర్వాత మళ్లీ టీడీపీలో చేరుతానని తాను పార్టీ అధినేతకు చెప్పినట్టు వర్మ తెలిపారు. చంద్రబాబు ఆశీర్వాదంతోనే తాను టీడీపీలో చేరానని చెప్పారు. గతంలో పదేళ్లపాటు టీడీపీ కోసం పనిచేశానని గుర్తు చేశారు. టీడీపీలో వర్మ చేరడంతో... సీమాంధ్ర అసెంబ్లీలో టీడీపీ బలం మరో స్థానం పెరిగింది.

  • Loading...

More Telugu News