: లిఫ్ట్ ఇస్తానంటూ బైక్ పై తీసుకెళ్లి అత్యాచారం


లిఫ్ట్ ఇస్తానంటూ యువతిని బైక్ పై ఎక్కించుకుని మరీ అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. మాన్పడా పోలీసుల కథనం ప్రకారం నిర్మాణ కార్మికురాలైన ఓ యువతి బుధవారం రాత్రి పని పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు దొంబివిలి బస్ స్టాప్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. సంతోష్ బెన్ అనే వ్యక్తి తన మిత్రుడితో కలిసి మోటార్ సైకిల్ పై వెళుతూ ఆ యువతికి లిఫ్ట్ ఇస్తామని బైక్ ఎక్కమన్నాడు. సంతోష్ తెలిసిన వ్యక్తి కావడంతో ఆ యువతి బైక్ ఎక్కింది.

గ్రామం సమీపంలోకి వచ్చాక బెన్ మిత్రుడు బైక్ దిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బెన్ ఆ యువతిని రాత్రి పది గంటల సమయంలో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ 376, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News