: టి.ప్రభుత్వం పట్ల ఎన్డీయే పక్షపాతంగా వ్యవహరిస్తే పోరాటం చేస్తాం: కవిత


నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన కేసీఆర్ కూతురు కవిత... జాగృతి అనే సంస్థను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ద్వారా తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారామె. ఇప్పుడు ఎంపీ గా ఎన్నికవడంతో, జాగృతి బాధ్యతలను వేరెవరికైనా అప్పగిస్తానని కవిత చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జాగృతి కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఎన్డీయే పక్షపాతంగా వ్యవహరిస్తే పోరాటానికి సిద్ధమవుతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలను కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News