: సునామీ వచ్చే అవకాశం లేదు... ప్రజలు భయపడవద్దు: శాస్త్రవేత్త శ్రీనివాస్ కుమార్


భూ ప్రకంపనలపై కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సునామీ హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ కుమార్ తెలిపారు. బంగాళాఖాతంలో బుధవారం రాత్రి సంభవించిన భూకంపం సునామీగా మారే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భూమి స్వల్పంగా కంపించిన విషయం విదితమే. భారత వాతావరణ శాఖ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ పై 6 గా పేర్కొంది.

విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సుమారు నాలుగు నుంచి ఐదు సెకన్ల పాటు శబ్దంతో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు ఇళ్లు, అపార్ట్ మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

కృష్ణాజిల్లాలోని విజయవాడ పరిసర ప్రాంతాల్లో, విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్. కోట, నెల్లిమర్ల, గజపతి నగరం ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో భూకంప ప్రభావం కనిపించింది.

  • Loading...

More Telugu News