: మోడీ ప్రమాణ స్వీకారానికి 'సార్క్' దేశాలకు ఆహ్వానం
ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటలకు దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవ్వాలంటూ 'సార్క్' దేశాల అధిపతులకు స్వయంగా మోడీయే ఆహ్వానం పంపారు. ప్రస్తుతం సార్క్ లో భారత్ తో కలిపి ఎనిమిది దేశాలకు సభ్యత్వం ఉంది.