: రాజధాని నిర్మాణానికి మేము సైతం అంటున్న సీమాంధ్ర ఉద్యోగులు


రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రకెక్కిన ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం అన్నింటికన్నా ప్రధానమైన అంశం రాజధాని నిర్మాణం. ఆర్థిక పరంగా చూస్తే ఇప్పటికే సీమాంధ్ర లోటు బడ్జెట్ లో ఉంది. దీంతో, రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే ప్రతి రూపాయి కోసం కేంద్రం వైపు చూడాల్సిన పరిస్థితి. అత్యున్నత సదుపాయాలతో రాజధాని నిర్మించుకోవాలంటే రాష్ట్ర బడ్జెట్లు కూడా సరిపోవు. దీంతో, నిధులను సమీకరించడానికి తాము సైతం అంటున్నారు సీమాంధ్ర ఉద్యోగులు. ప్రతి ఉద్యోగి 10 వేల రూపాయల వరకు డొనేషన్లను వసూలు చేసి... రాజధాని నిర్మాణం కోసం పంపుతామని చెబుతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి అనుబంధంగా ఒక ప్రత్యేక ఖాతాను తెరవాలని సూచిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయనను స్వయంగా కలసి దీనికి సంబంధించి చర్చిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.

  • Loading...

More Telugu News