: ఇడుపులపాయలో నేడు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం


వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపక్ష సమావేశం ఈ రోజు కడప జిల్లా ఇడుపులపాయలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను సమావేశంలో జగన్ వివరించనున్నారు. కాగా ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇడుపులపాయ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News