: గుజరాత్ సీఎం పదవికి రేపు నరేంద్రమోడీ రాజీనామా
గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి నరేంద్రమోడీ రేపు (బుధవారం) రాజీనామా చేయనున్నారు. సుదీర్ఘంగా 12 సంవత్సరాల పాటు గుజరాత్ ను పాలించిన మోడీ, లోక్ సభలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపికైన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారు. ఈ నెల 26వ తేదీన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే.
గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ తన రాజీనామా లేఖను గవర్నర్ కమ్లా బేణీవాల్ కు సమర్పిస్తారు. గుజరాత్ శాసనసభలో తన గౌరవార్థం ఏర్పాటు చేసే వీడ్కోలు సమావేశానికి మోడీ హాజరవుతారు. రేపు మధ్యాహ్నం 3.30కి మోడీ రాజీనామా సమర్పిస్తారు.